Friday, March 29, 2024

మూడు కీ బోర్డులు విర‌గ్గొడితే కానీ.. భీమ్లానాయ‌క్‌ ట్యూన్ రాలేదు: ప్రి రిలీజ్ ఈవెంట్‌లో థ‌మ‌న్

భీమ్లా నాయ‌క్ ప్రిరీలీజ్ ఈవెంట్ అట్ట‌హాసంగా కొన‌సాగుతోంది. భీమ్లా నాయ‌క్ టైటిల్ ట్రాక్ ఏ రేంజ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తూ..గూస్ బంప్స్ తెప్పిస్తుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ టీమ్‌ గూస్ బంప్స్ తెప్పించేలా పాట‌లు పాడింది. ఈ సాంగ్ గురించి థ‌మ‌న్ మాట్లాడుతూ.. భీమ్లానాయ‌క్ టైటిల్ సాంగ్ మా అంద‌రికీ చాలా చాలా ఫేవ‌రేట్ సాంగ్. హీరో ఇంట్రో సాంగ్ చేయాలంటే ఒక పూన‌కం వ‌స్తుంది. కానీ అది ప‌వ‌ర్ స్టార్ కు చేయడ‌మంటే రెండు మూడు కీ బోర్డులు విర‌గ్గొట్టి కానీ ఈ ట్యూన్ రాలేదు. ఈ పాట మాక్కూడా పెద్ద ప్ర‌యోగం లాంటిది. గుంటూరు కారం ఆ యూనిఫార‌మ్‌.. మంటెత్తిపోద్ది నేరాలు చేస్తే.. సెల‌వు అంటు అన‌డు.. శనాది వారం అంటూ పాడుకొచ్చాడు థ‌మ‌న్‌. ఈ పాట‌కు సింగ‌ర్ ఎవ‌ర‌నుకున్న‌పుడు ర‌స్తిక్ వాయిస్ ఉండాల‌ని రామ్ మిర్యాల‌ను పెట్టామ‌ని చెప్పుకొచ్చాడు.

పాట రాసిన రామ‌జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ఈ పాట త‌యారుచేసిన‌పుడు మ్యాజిక‌ల్ మూమెంట్స్.. మూడు పాట‌లు మూడు రోజుల త‌క్కువ వ్య‌వ‌ధిలోనే చేశాం. టైటిల్ ట్రాక్ ఉద‌యం కూర్చొని సాయంత్రానికి పూర్తి చేశాం. సాయంత్రం త్రివిక్ర‌మ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చి పాట అని ప్ర‌తీ అక్ష‌రాన్ని ఎంజాయ్ చేస్తూ..నా చేతిలో ఉన్న ప్యాడ్ తీసుకొని ఆ లిరిక్స్ చ‌దువుతూ..ఓ ర‌చ‌న‌కు ఆయ‌నిచ్చేట్వంటి సమున్న‌త‌మైన సంస్కారం, గౌర‌వం అలాంటిదన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement