Tuesday, April 30, 2024

ఆర్​సీబీ కెప్టెన్​ ఎవరు? కన్​ఫాం చేయని మేనేజ్​మెంట్​..

ఐపీఎల్‌ 2022 సీజన్‌ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఒక్క రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తప్ప అన్ని ఫ్రాంచైజీలు తమ కెప్టెన్‌లను నియమించుకున్నాయి. ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్‌ రేసులో మ్యాక్స్‌వెల్‌, డుప్లెసిస్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌ షెడ్యూల్‌ కూడా వ‌చ్చేసింది. ఈ సీజన్‌లో మరో రెండు కొత్త జట్లు అరంగేట్రం చేయడంతో లీగ్‌ మరింత రసవత్తరంగా మారింది. ఆర్సీబీ కెప్టెన్సీ విషయంలో.. మ్యాక్స్‌వెల్‌ తన వివాహం కారణంగా ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. దీంతో డుప్లెసిస్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని అందరూ భావిస్తున్నారు.

అయితే అనూహ్యంగా ఇప్పుడు దినేష్‌ కార్తిక్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. గతంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ కూడా కార్తిక్‌ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోం ది. వేలానికి ముందు విరాట్‌ కోహ్లీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌తో పాటు మహ్మద్‌ సిరాజ్‌లను ఆర్‌సీబీ రిటైన్‌ చేసుకుంది. ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో ఆర్సీబీ కార్తీక్‌ను రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసిం ది. ఐపీఎల్‌ 2022 షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం విడుదల చేసిం ది. వాంఖడే వేదికగా తొలి మ్యాచ్‌ చెన్నైతో కేకేఆర్‌ తలపడనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement