Friday, April 26, 2024

Smart Tech: వాట్సాప్​ కొత్త ఫీచర్​.. గ్రూప్​ కాలింగ్​ కోసం కాల్​ లింక్​ ఫెసిలిటీ అందుబాటులోకి

Wahtsapp మెస్పేజింగ్​ యాప్​ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్​ని అందుబాటులోకి తెస్తోంది. ఇప్పుడు లేటెస్ట్​గా ఓ సరికొత్త అప్​డేట్​ని తీసుకొచ్చింది. వాట్సాప్ వీడియో లేదా వాయిస్ కాల్‌లలో జాయిన్​ కావడానికి కాల్ లింక్‌లను షేర్​ చేసుకునే ఆప్షన్​ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు గత నెలలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు.

కాల్స్ ట్యాబ్‌లోని ‘కాల్ లింక్‌లు’ ఆప్షన్​ని ప్రెస్​ చేయడం ద్వారా వినియోగదారులు ఆడియో లేదా వీడియో కాల్ కోసం కొత్త లింక్​ని ప్రారంభించొచ్చు. ఇది జూమ్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌లు అందించే ఫీచర్‌ను పోలి ఉంటుంది. కేవలం లింక్‌పై నొక్కడం ద్వారా కాల్‌లలో చేరడానికి ఇతర ఫ్రెండ్స్​ని యాడ్​ చేసుకునే అవకాశం ఉంటుంది.

అయితే.. మొన్నటిదాకా బీటా వర్షన్​ టెస్ట్​లో భాగంగా ఇచ్చిన ఈ ఫీచర్ క్రమంగా మిగతా యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. యాప్ గ్రూప్ కాలింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం టార్గెట్​గా దీన్ని అందించనున్నారు. కాల్ లింక్‌ ఉన్న వారు ఎవరైనా ఈ గ్రూప్​ కాల్‌లో జాయిన్​ కావచ్చు. వారు మీ గ్రూప్‌లో పార్టిసిపెంట్ కాకపోయినా సరే.. కాల్​ లింక్​ ఉంటే సరిపోతుంది. ఇట్లా ఈ కాల్ లింక్ 90 రోజుల దాకా వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం మొబైల్ పరికరాల్లో మాత్రమే సపోర్ట్ చేస్తుందని, దీని వెబ్​ ఆప్షన్​ ఇంకా పరిశీలించలేదని తెలుస్తోంది..

WhatsAppలో కాల్ లింక్‌ని ఎలా సృష్టించాలంటే.. మొదట కాల్స్ ట్యాబ్‌ను నొక్కాలి. ఆ తర్వాత కాల్ లింక్‌ని క్రియేట్​ చేయాలి.. అప్పుడు వీడియో, లేదా వాయిస్​ కాల్​ ఆప్షన్​ ఎంచుకోవాలి.. ఆ తర్వాత వచ్చే లింక్​ని షేర్​ చేయాలి.. ఇట్లా కాల్​ లింక్స్​ని షేర్​ చేసి గ్రూప్​ కాల్​ మీటింగ్​ నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement