Saturday, May 4, 2024

WhatsApp | వాట్సాప్​లో కొత్త ఫీచర్​.. గ్రూపుల్లో పేరు సెర్చ్​ చేసేందుకు కొత్త ఆప్షన్​!

​మెటా సంస్థకు చెందిన మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ WhatsAppలో కొత్త అప్​డేట్​ వచ్చింది. ఈమేరకు ఈ విషయాన్ని వాట్సాప్​ బీటీ ఇన్​ఫోలో తెలియజేశారు. ఇక.. డెస్క్ టాప్ వెర్షన్‌లో కాంటాక్ట్​ పేరును ఎంటర్​ చేయడం ద్వారా గ్రూప్స్​లో సెర్చ్​ చేసుకునే ఫెసిలిటీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్‌ను విడుదల చేసినట్టు వాట్సాప్​ తెలిపింది. తాజా WhatsApp డెస్క్ టాప్ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ ఫీచర్ కొంతమంది వినియోగదారులకు కనిపించిందని WABetaInfo లో ఇన్​ఫాం చేశారు.

కొత్త ఫీచర్‌తో వినియోగదారులు సెర్చ్​ బార్​లో వారి పేరును ఎంటర్​ చేయడం ద్వారా ఇటీవలి గ్రూపులలో ఉన్న పేరును పొందవచ్చు. ప్లాట్‌ఫారమ్‌లో అనేక గ్రూప్స్​లో చేరిన యూజర్లకు, నిర్దిష్ట పరిచయంతో ఉమ్మడిగా ఉన్న గ్రూప్​ పేరు గుర్తుకు రాని వారికి ఇది ఎంతో హెల్ప్​ ఫుల్​గా ఉండనుంది. రానున్న రోజుల్లో మరింత మందికి ఈ ఫీచర్​ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్​ తెలిపింది.

గత నెలలో  వాట్సాప్ డెస్క్ టాప్ బీటాకి చెందిన ఫ్యూచర్​ అప్‌డేట్ కోసం.. గ్రూప్ చాట్‌ల కోసం మ్యూట్ షార్ట్ కట్‌పై మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ మరింత మెరుగైన పనితీరుకో పనిచేస్తోంది. మ్యూట్ షార్ట్ కట్ గ్రూప్ చాట్‌ల ఎగువన ఉండేలా దీన్ని రూపొందిస్తోంది. గ్రూప్‌లో వచ్చిన మెస్సేజులను, నోటిఫికేషన్‌లను మ్యూట్​ చేయడానికి యూజర్లకు ఇది ఎంతో సహాయపడుతుంది. ఇక.. ఈ నెల ప్రారంభంలో మెటా ఫౌండర్, CEO మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ డిజిటల్ అవతార్‌లను మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌కు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement