Monday, May 13, 2024

Smart Tech: వాట్సాప్ బిగ్ అప్‌డేట్‌.. గ్రూపుల్లో 512 మందిని యాడ్ చేసుకోవ‌చ్చు

వాట్సాప్ మ‌రో కొత్త ఫీచర్ వ‌చ్చేసింది. ఇప్పుడు వాట్సాప్ గ్రూపులో ఎక్కువ మందిని యాడ్ చేసే ఫీచర్‌ను తీసుకువచ్చారు. ఈ కొత్త ఫీచర్ ద్వారా 512 మందిని ఒకే గ్రూపులో యాడ్ చేయవచ్చు. ఇంతకుముందు వాట్సాప్ గ్రూపులో 256 మందిని మాత్రమే యాడ్ చేసే అవకాశం ఉంది.

అయితే మార్కెట్లో ఉన్న మిగతా మెసేజింగ్ యాప్స్ ఇంకా ఎక్కువ మందిని యాడ్ చేసుకునే ఫీచర్లను అందిస్తున్నాయి. ఉదాహరణకు టెలిగ్రాం యాప్‌ను తీసుకుంటే అందులో ఏకంగా 2 లక్షల మందిని వరకు యాడ్ చేసే అవకాశం ఉంది.

వాట్సాప్ గ్రూపు సభ్యుల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు మెటా గత నెలలో ప్రకటించింది. WABetainfo కథనం ప్రకారం ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐవోఎస్, డెస్క్ టాప్ వినియోగదారులకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

ఈ కొత్త ఫీచర్ మీ ఫోన్‌లో వచ్చిందో రాలేదో తెలుసుకోవడం కోసం వాట్సాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రూపులో 512 మందిని యాడ్ చేయగలిగితే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లే. ట్రై చేసి చూడండి మ‌రి..

Advertisement

తాజా వార్తలు

Advertisement