Monday, April 29, 2024

ఇంధ‌న ధ‌ర‌ల్లో స్వ‌ల్ప మార్పులు.. నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఎట్లున్నాయంటే..

మొన్న‌టిదాకా దేశంలో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతూ వ‌చ్చి లీటరు పెట్రోల్ రూ.120 దాటింది. ఈ మ‌ధ్య‌నే కేంద్రం ఎక్సైజ్ సుంకం త‌గ్గించ‌డంతో పెట్రోల్ ధర రూ.9కి పైగా, డీజిల్ రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో కాస్త ఉపశమనం కలిగిందని సామాన్యులు భావిస్తున్నారు. అయినా పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ప‌న్నుల రూపంలో ఇంకా దండుకుంటూనే ఉంద‌న్న విష‌యం వినియోగ‌దారులంద‌రికీ తెలుస్తూనే ఉంది.

సెస్సులు త‌గ్గిస్తే క‌నుక సాధార‌ణంగా పెట్రోలు 80 రూపాయ‌ల‌కు లీట‌ర్ ఇవ్వొచ్చ‌నేది ప్ర‌తి ఒక్క‌రికి అవ‌గాహ‌న‌లోకి వ‌చ్చింది. అంటే దాదాపు ఒక్క లీట‌ర్ పెట్రోల్‌పై కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తి వినియోగ‌దారుడు అద‌నంగా 30 రూపాయ‌ల‌కు పైగానే చెల్లిస్తున్నామ‌న్న‌ది బాధ‌పెడుతోంది. అందుక‌ని కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై చాలామంది సామాన్యులు ఆగ్ర‌హంగా ఉన్నార‌న్న‌ది వాస్త‌వం. కాగా ఇవ్వాల్టి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఎట్లున్నాయంటే..

తెలంగాణలో ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇవ్వాల‌ నిలకడగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర తగ్గి రూ.97.82గా ఉంది. వరంగల్‌లో కాస్త పెట్రో ధ‌లు పెరిగాయి. ఇవ్వాల (జూన్ 14) పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.109.35 గా ఉంది. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.97.52గా ఉంది. హ‌న్మ‌కొండ‌ జిల్లాలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో పెట్రోల్ ధర నేడు రూ.0.37 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.111.70 గా ఉంది. డీజిల్ ధర ఇవ్వాల రూ.0.34 పైసలు పెరిగి రూ.99.72 గా ఉంది. కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు బాగా ఉంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ..
విజయవాడ మార్కెట్‌లో ఇంధన ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధర ఇవ్వాల‌ రూ.0.05 పైసలు పెరిగి రూ.111.81 గా ఉంది. డీజిల్ ధర రూ.0.05 పైసలు పెరిగి రూ.99.56 గా ఉంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు తగ్గింది. లీటరు ధర రూ.0.80 పైసలు తగ్గి రూ.110.48 గా ఉంది. డీజిల్ ధర కూడా నేడు రూ.0.74 పైసలు తగ్గి.. ధర రూ.98.27గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement