Wednesday, May 1, 2024

Wrong Call | కొంప‌ముంచిన రాంగ్ కాల్‌.. రాజేశ్‌, టీచ‌ర్ సుజాత విష‌యంలో ఏం జ‌రిగిందంటే!

హైద‌రాబాద్‌లోని హయత్ నగర్‌లో ఈ మ‌ధ్య జ‌రిగిన ఇన్సిడెంట్ స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారుల‌ను ఆందోళ‌న‌లో పడేశాలా ఉంది. ఓ రాంగ్ కాల్ అప‌రిచితుల ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యాన్ని పెంచ‌గా.. అది కాస్త వివాహేత‌ర సంబంధానికి దారితీసి ప్రాణాల‌నే బ‌లితీసుకుంది. దీంతో రాంగ్ కాల్స్ విష‌యంలో పోలీసులు సీరియ‌స్ హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. అన్ నోన్ నెంబ‌ర్స్ నుంచి కానీ, అప‌రిచుత‌ల నుంచి కానీ కాల్స్ వ‌స్తే రెస్పాండ్ కావొద్ద‌ని చెబుతున్నారు.

– ఇంట‌ర్నెట్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌

హైద‌రాబాద్ ఘ‌ట‌న‌లో రాజేశ్ మృతి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రాజేశ్, టీచర్ సుజాత మధ్య పరిచయం కూడా ఆసక్తికరంగా జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీడియాలో ప‌లు ర‌కాల వార్తలు వస్తున్నాయి. రెండు నెలల క్రితం సుజాత చేసిన రాంగ్ డయల్ రాజేశ్ కు వచ్చింది. ఈ రాంగ్ డయల్ తో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. టీచర్ సుజాత, రాజేశ్ మధ్య తరుచూ వాట్సాప్ చాటింగ్ జ‌రిగింది. సుజాత డీపీని చూసి ఆమెకు ఇంకా పెళ్లి కాలేదని రాజేశ్ భావించాడు. ఆమెను ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ క్ర‌మంలోనే సుజాతతో కలిసి పలుమార్లు దేవరకొండ దాకా కారులో జ‌ర్నీ చేశాడు.

ఇక‌.. కొద్ది నెలల పరిచయం తర్వాత సుజాతకు పెళ్లి అయిన‌ విషయాన్ని రాజేశ్ తెలుసుకున్నాడు. తనను సుజాత మోసం చేసిందని ఆమెపై కోపం పెంచుకున్నాడు. అంతేకాదు ఆ తర్వాత ఆమెను దూరం పెడుతూ వ‌చ్చాడు. కానీ, ఓసారి కలుద్దాం రావాల‌ని సుజాత అతనికి మెసేజ్ పెట్టింది. అయినా రాజేశ్ స్పందించకపోవడంతో తాను చనిపోతానని బెదిరించింది. నువ్వు చనిపోతానని బెదిరిస్తే.. నేను కూడా చనిపోతానని రాజేశ్ ఆమెతో చెప్పాడు.

- Advertisement -

ఈ క్రమంలో.. సుజాతను కలిసేందుకు హయత్ నగర్ వచ్చాడు. అప్పటికే సుజాత ఆత్మహత్యాయత్నం చేసింది. రాజేశ్, సుజాత వ్యవహారం సుజాత కొడుకు, కూతురుకు తెలియ‌డంతో రాజేశ్ రాగానే అతనిపై దాడి చేశారు. కాగా, రాజేశ్ భయంతో మందు తాగాడు. సుజాత ఇంటికి సమీపంలో శవమై తేలాడు. అయితే.. రాజేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయ‌ని, అతను దాడి చేయడం వల్లనే చనిపోయాడా? లేక తాగిన మైకంలో చనిపోయాడా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక త‌ర్వాత కానీ దీనిపై ఓ క్లారిటీ వ‌స్తుంద‌ని అప్పుడు త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement