Monday, February 26, 2024

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో మేమే గెలుస్తాం.. స్పీకర్ తమ్మినేని

వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో మేమే గెలుస్తామని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితమవుతుందన్నారు. మా పదవుల కోసం జగన్ ను పొగడటం లేదన్నారు. రాష్ట్ర సౌభాగ్యం కోసం జగన్ మళ్ళీ మళ్ళీ గెలవాలన్నారు. రాష్ట్రంలో ఏ గడపకు వెళ్లినా.. జగన్ నామస్మరణే అన్నారు. తాను ప్లీనరీకి వస్తే రాజకీయం చేస్తున్నారన్నారు. టీడీపీ మహానాడులో ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాద్ పాల్గొనలేదా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement