Thursday, April 25, 2024

పంట దెబ్బతిన్న రైతులను ఆదుకుంటాం.. మంత్రి ఎర్రబెల్లి

నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్న రైతులను ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దెబ్బతిన్న పంట నష్టాలను పరిశీలిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాటేడు వద్ద జొన్నచేనులో మీడియాతో మాట్లాడుతూ… నిన్న కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని కలిగించిందన్నారు. రైతులు వేసిన పంటలు నష్టానికి గురయ్యాయన్నారు. మిరప, మొక్కజొన్న, మామిడి, టమాటో, అక్కడక్కడా వరి, కూరగాయలు వంటి పంటలతో పాటు కొన్నిచోట్ల ఇండ్లు దెబ్బ తిన్నాయన్నారు. ఈరోజు ఉదయం నుంచి పంట నష్టాలను తాను స్వయంగా పరిశీలిస్తున్నానన్నారు.

పంటలు నష్టపోయిన రైతులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, మరోవైపు అధికారులు కూడా పంట నష్టాలను అంచనా వేస్తున్నారన్నారు. వ్యవసాయ, రెవెన్యూ వంటి శాఖల అధికారులు సర్వే నిర్వహిస్తున్నారన్నారు. పంట నష్టాల అంచనాలు తేలిన తర్వాత పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం పంటల నష్టాలు అంచనా వేస్తున్నామన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మంత్రి వెంట మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement