Monday, March 27, 2023

Breaking: పిల్లలు బాగా చదవాలి.. ఎదగాలి.. సీఎం జగన్

పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని, పిల్లలు బాగా చదవాలి, ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జగనన్న విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… మ‌నిషి త‌ల‌రాత‌ను, కుటుంబం త‌ల‌రాత‌ను మార్చే శ‌క్తి చ‌దువుకు మాత్రమే ఉంద‌ని జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. చీకటి నుంచి వెలుగులోకి ఏ మనిషినైనా నడిపించేది చదువేనన్నారు.

- Advertisement -
   

మనిషి తలరాతను గానీ, కుటుంబం తలరాతను గానీ మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందన్నారు. అలాంటి చదువుకు పేదరికం అడ్డుకాకూడదని, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ఇస్తున్నామన్నారు. ఈరోజు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9.86 లక్షలమంది విద్యార్థులకు మేలుచేస్తూ రూ.698.68 కోట్లను తల్లుల ఖాతాల్లో జమచేస్తున్నామన్నారు. పిల్లల చదువులు ఆగిపోవద్దనే పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement