Thursday, September 28, 2023

గాంధారిలో రేవంత్ రెడ్డి నిరుద్యోగ దీక్ష..

కామారెడ్డి ప్రభన్యూస్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి ఆదివారం నిరుద్యోగ దీక్ష చేపట్టారు. కేసీఆర్ సర్కార్ నిరుద్యోగుల పాలిట నిరంకుశంగా వ్యవహరిస్తుందని, ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది.. కానీ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నా పత్రాలన్నీ లీకు అవుతున్నాయని ఆరోపించారు. నిరుద్యోగులను, రైతులను కేసీఆర్ సర్కారు నిండా ముంచిందన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగ, రైతుల, ప్రజా వ్యతిరేక సర్కారని విమర్శించారు. రేవంత్ రెడ్డితో పాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ములుగు ఎమ్మెల్యే సీతక్క, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సుభాష్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, మహేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement