Thursday, May 2, 2024

మ‌న‌వ‌రాలికి ఘ‌న‌స్వాగ‌తం – ఏకంగా హెలికాఫ్ట‌ర్ బుక్ చేసిన సాధార‌ణ రైతు

త‌మ కుటుంబంలో ఆడ‌పిల్ల పుట్టింద‌ని మురిసిపోయారు. ఏకంగా ఆ మ‌న‌వ‌రాలిని త‌మ ఇంటికి తీసుకువ‌చ్చేందుకు హెలికాఫ్ట‌ర్ నే బుక్ చేశాడు ఓ రైతు. ఈ సంఘ‌ట‌న పుణెలోని బాలువాడి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన అజిత్ పాండురంగ్‌ బల్వాడ్కర్‌కు మనవరాలు పుట్టిందని తెలిసి ఆనందంలో ఉప్పొంగిపోయాడు. ఆ పాపను అమ్మమ్మ వాళ్లింటి నుంచి తీసుకురావడానికి హెలికాప్టర్‌ బుక్‌ చేశాడు. తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్న ఆయన ‘మా కుటుంబలోకి ఆడపిల్ల రావడం మాకెంతో ఆనందంగా ఉంది. మా సరికొత్త సభ్యురాలు కృషికాకు మేమంతా ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఇలా ఆకాశమార్గంలో ఆమెను తీసుకువచ్చామ‌ని త‌మ ఆనందాన్ని పంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement