Monday, April 29, 2024

ప్రధాని మోదీతో మాట్లాడనున్న వరంగల్ వాసి!

ప్రధాని నరేంద్ర మోదీ రేడియోలో ప్రసంగించే ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన చాయ్‌వాలా పాల్గొన‌నున్నాడు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న ఆత్మ నిర్భ‌ర్ ప‌థ‌కం ద్వారా రుణం తీసుకుని స‌ద్వినియోగం చేసుకున్న దేశంలోని కొంద‌రు వీధి వ్యాపారులను మన్‌ కీ బాత్‌కు ఎంపిక చేశారు. ఇందులో వరంగల్‌ కు చెందిన మహ్మద్‌ పాషా అనే చిరువ్యాపారి ఎంపిక అయ్యారు. ‘మన్‌ కీ బాత్‌’ పాల్గొనాల‌ని ఆయ‌న‌కు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి లేఖ అందింది.

వరంగల్‌ నగరంలోని పాటక్‌ మహేలా ప్రాంతానికి చెందిన చాయ్‌వాలా మహ్మద్‌ పాషా 40 ఏళ్లుగా ఎంజీఎం ఆసుప‌త్రి వద్ద ఫుట్‌పాత్‌పై టీస్టాల్ న‌డుపుకుంటూ జీవిస్తున్నాడు. కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న ఆత్మ నిర్భ‌ర్ ప‌థ‌కం ద్వారా పాషా  రూ.10వేల రుణాన్ని తీసుకుని సద్వినియోగం చేసుకున్నాడు. అలాగే, టీ అమ్మకాలకు గూగుల్‌పే, ఫోన్‌పే వాడుతున్నాడు. పీఎంఓ నుంచి ఫోన్ రావ‌డంతో పాషా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  వ‌చ్చే నెల మ‌న్ కీ బాత్‌లో ప్రధాని మోదీ పాషాతో మాట్లాడ‌నున్నారు.

ఇది కూడా చదవండి: పరీక్షలు వాయిదా వేయండి: మోదీకి లేఖ రాసిన సీఏ స్టూడెంట్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement