Monday, May 6, 2024

Bigg Boss 5: ఈ సీజన్ విజేత ఎవరంటే..

తెలుగు రియాల్టీ షో బిగ్‌ బాస్ సీజన్ 5 క్లైమాక్స్ కు చేరింది. ఈ సీజన్ లో విజేత ఎవరు ? అన్న విషయం కొద్ది గంటల్లో తేలిపోనున్నది. ప్రస్తుతం టైటిల్ రేసులో విజే సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్రలు ఉన్నారు. బిగ్‌బాస్ సీజన్ 5లో టాప్ 5లో ఉన్న సిరి, మానస్ లు ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. దీంతో శ్రీరామచంద్ర, విజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ కోసం పోటీ పడ్డారు. అయితే శ్రీరామచంద్ర 25 లక్షల సూట్ కేసు తీసుకొని బయటకు వచ్చినట్టు సమాచారం.

బిగ్‌బాస్ తెలుగు 5 విజేతగా వీజే సన్నీ నిలిచినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓట్ల లెక్కింపు తర్వాత విజే సన్నీ విజేతగా నిలిచినట్టు తెలుస్తోంది. షణ్మఖ్ రన్నరప్‌గా, విజే సన్నీగా బిగ్ బాస్ సిజన్ 5 విన్నర్‌ గా నిలిచినట్లు తెలుస్తోంది. అయితే, ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ లో ఈ విషయం తెలియనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement