Saturday, October 12, 2024

Viral Video: నాటు తుపాకీతో టీచర్ హల్ చల్

నాటు తుపాకీతో తిరుగుతున్న ఓ ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో చోటు చేసుకుంది. కరిష్మాసింగ్‌ యాదవ్‌ అనే మహిళ ఫిరోజాబాద్‌లో టీచర్‌గా పనిచేస్తున్నది. అయితే ఆమె మెయిన్‌పురిలోని కొత్వాలీ ప్రాంతంలో నాటు తుపాకీ జేబులో పెట్టుకొని తిరుగుతుండగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తనిఖీ చేయగా ఆమె పాయింట్‌ జేబులో దేశీయ తుపాకీ లభించింది. దీంతో ఆ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై అక్రమాయుధాల కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, కొత్వాలి ప్రాంతంలో ఓ మహిళ ఆయుధంతో సంచరిస్తున్నట్లు తమకు పక్కా సమాచారం అందిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దీంతో తాము ఆ మహిళను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement