Friday, April 26, 2024

ఏపీ-తెలంగాణ సరిహద్దులో భారీగా నిలిచిపోయిన వాహనాలు

కరోనా వైరస్ ఉధృతి కారణంగా ఏపీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలులోకి రావడంతో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వాహనాలు సరిహద్దుల వద్ద నిలిచిపోయాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏపీ సరిహద్దులైన గరికపాడు, వాడపల్లి చెక్‌పోస్టుల వద్ద అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఏపీలో మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉండటంతో ఎటువంటి వాహనాలను అనుమతించమంటూ తెలంగాణ నుంచి వెళ్లే వాహనాలను అధికారులు నిలిపివేస్తున్నారు.

దీంతో ఆయా చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కర్ఫ్యూ నుంచి పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నారు. విమాన, రైల్వే ప్రయాణాలకు టిక్కెట్లు చూపేవారిని, అత్యవసర సేవలు వినియోగించుకునే వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. కాగా ఏపీ రాష్ట్ర సరిహద్దుల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement