Sunday, May 19, 2024

అస‌దుద్దీన్ ఒవైసీ ప్ల‌వ‌ర్ కాదు – ఫైర్ – త‌గ్గేదే లే – వారిస్ ప‌ఠాన్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి నేడు చివ‌రి రోజు. ఈ సంద‌ర్భంగా AIMIM అధికార ప్ర‌తినిధి వారిస్ ప‌ఠాన్ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా తెలుగు చిత్రం పుష్ప లోని డైలాగ్ ల‌ని ఆయ‌న వాడారు. ఒవైసీ ప్ల‌వ‌ర్ కాదని.. ఫైర్ అని ప‌ఠాన్ అన్నారు. దాంతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. యూపీలోని ముబారఖ్‌పూర్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తూ వారిస్ పఠాన్ ఈ విషయం చెప్పారు. పుష్ప డైలాగ్‌పై పఠాన్ మాట్లాడుతూ.. తాను ఎవరికీ భయపడనని, ఎవరికీ తలవంచనని చెప్పారు. తమ హక్కుల కోసం పోరాడుతామన్నారు. రాజ్యాంగం పరిధిలోనే ఈ యుద్ధం చేస్తాం. డైలాగులు చెప్పడంతో పాటు గెడ్డంపై చేయి వేసి త‌గ్గేదే లే అన్నారు. ఏఐఎంఐఎం అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి)తో పాటు ఇతర పార్టీలను కూడా అబద్ధాలకోరు అని అన్నారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. హక్కు కోసం ఎవరి ముందు తలవంచరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement