Monday, April 29, 2024

ర‌ష్యా గ్యాస్‌, ఆయిల్ కంపెనీల‌పై అమెరికా బ్యాన్‌.. పుతిన్ వార్ మేషీన్‌గా మారాడ‌న్న బైడెన్‌

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన ర‌ష్యా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా దెబ్బ తీసేందుకు అమెరికా రెడీ అయ్యింది. అందులో భాగంగా మంగ‌ళ‌వారం అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్.. ర‌ష్యాపై మ‌రిన్ని ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ర‌ష్యా గ్యాస్‌, ఆయిల్ కంపెనీల‌పై నిషేధం విధిస్తున్న‌ట్లు తెలిపారు. ర‌ష్యా నుంచి ప్ర‌పంచ దేశాల‌కు అన్నిర‌కాల దిగుమ‌తుల‌ను జో బైడెన్ నిషేధించారు.ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్ మిషిన్‌గా మారాడ‌ని జో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో యూరోపియ‌న్ యూనియ‌న్ మిత్ర దేశాలు త‌మ‌తో క‌లిసి వ‌చ్చేలా లేవ‌ని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌, పోలండ్‌ల్లో ప‌రిస్థితుల‌పై స‌మీక్షిస్తున్నామ‌ని చెప్పారు. ఉక్రెయిన్‌కు త‌మ ఆయుధాల స‌ర‌ఫ‌రా కొన‌సాగుతూనే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఉక్రెయిన్ శ‌ర‌ణార్థుల‌కు అండ‌గా నిలుస్తామ‌ని తేల్చి చెప్పారు జో బైడెన్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement