Monday, April 29, 2024

మహిళతోనే సమాజాభివృద్ధి, యూనియన్‌ బ్యాంక్‌ ఇండియాలో ఉమెన్స్‌ డే

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సికింద్రాబాద్‌ రీజియన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బ్యాంకు రీజినల్‌ హెడ్‌ శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ యూబీవీఎన్‌ శ్రీనివాస రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిమ్స్‌, ప్రముఖ గైనకాలిస్టు డాక్టర్‌ త్రిపురసుందరి హాజరయ్యారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఎలాంటి పరిస్థితులు అయినా ఎదుర్కొని అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నారని బ్యాంక్‌ రీజినల్‌ హెడ్‌ శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. ఆయా రంగాల్లో మహిళలు ఎంతో రాణిస్తున్నారని, తమ కెరీర్‌ పట్ల ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారంటూ యూబీవీఎన్‌ శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు.

తాను చదువుకున్న సమయంలో ఎన్నో లక్ష్యాలు సాధించానని, కర్నూల్‌ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్యను పూర్తి చేసినట్టు ముఖ్య అతిథిగా వచ్చిన కిమ్స్‌ సీనియర్‌ గైనకాలజిస్టు త్రిపుర సుందరి చెప్పుకొచ్చారు. ఏపీలోని పలు ఆస్పత్రుల్లో సుమారు 35 ఏళ్ల పాటు వైద్య సేవలు అందించినట్టు వివరించారు. గాంధీ ఆస్పత్రిలోని ఒబెస్ట్రిక్‌ డిపార్ట్‌మెంట్‌, గైనకాలిజిస్టు డిపార్ట్‌మెంట్‌లకు హెచ్‌ఓడీగా కూడా ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్‌ బ్యాంకు చీఫ్‌ మేనేజర్స్‌ వీ చందనా శ్రీ రూపా, అల్ద్రానీ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement