Saturday, May 18, 2024

మ‌రోసారి ఉక్రెయిన్ కు అమెరికా సాయం

ఉక్రెయిన్ వ‌ర్సెస్ ర‌ష్యా యుద్ధం కొన‌సాగుతోంది. రష్యా భీకర దాడులతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్​కు అమెరికా మ‌రోసారి సాయం అందించనుంది. ఇందుకోసం రూపొందించిన 13.6 బిలియన్​ డాలర్లు కేటాయించేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. రిపబ్లికన్లు కూడా ఇందుకు మద్దతు తెలిపారు. 13.6 బిలియన్ల ద్వారా ఉక్రెయిన్​కు ఆయుధ, మానవతా, ఆర్థిక సహకారం అందించనుంది అమెరికా. తన బలగాలను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు తరిలించేందుకు ఈ నిధులను ఉపయోగించనుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదట 600 డాలర్లు అమెరికా ఉక్రెయిన్ కు సాయం చేసిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement