Monday, May 6, 2024

అమ్మాయిల‌పై న‌మ్మ‌కం లేదా : అస‌దుద్దీన్ పై మండిప‌డ్డ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ న‌ఖ్వీ

రీసెంట్ గా క‌ర్ణాట‌క అసెంబ్లీలో ఎమ్మెల్యే ర‌మేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌గా పెద్ద దుమార‌మే రేగింది. రేప్ చేస్తే ఆనందించండి అన్న వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఆ వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే మ‌రో వివాదం చెల‌రేగింది. 18 ఏళ్లకే ప్రధానిని ఎంచుకోగల అమ్మాయిలు… వారికి కావాల్సిన భర్తను ఎంచుకోలేరా అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. మరోవైపు కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. 21 ఏళ్లకు ఆడపిల్లలకు పెళ్లి చేస్తే వారు తిరుగుబోతులుగా మారతారని కొందరు అంటున్నారని… వాళ్లెందుకు తిరుగుబోతులవుతారని ప్రశ్నించారు. అమ్మాయిలపై మీకు నమ్మకం లేదా? అని అడిగారు. ఇది హిందుస్థానీ మైండ్ సెట్ కాదని తాలిబానీ మైండ్ సెట్ అని దుమ్మెత్తిపోశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement