Friday, May 3, 2024

అన్ని రాష్ట్రాల్లో ఎన్ ఐఏ కార్యాల‌యాలను ఏర్పాటు చేస్తాం-అమిత్ షా

రాయ్ పూర్ బ్రాంబ్ ఎన్ ఐఏ కార్యాల‌యాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్, మాజీ సీఎం రమణ్ సింగ్, కేంద్ర మంత్రి రేణుకా సింగ్ తదితరులతో కలిసి ప్రారంభించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు అన్ని రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని అమిత్ షా అన్నారు. తద్వారా ఎన్ఐఏను ఫెడరల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా మార్చాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా ఎన్ఐఏ ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక ప్రధాన దర్యాప్తు సంస్థగా గుర్తింపు పొందిందన్నారు.

ఒక చిన్న పతనం తరువాత, ఏజెన్సీ తన లక్ష్యాలన్నింటినీ సాధించగలిగింది. ఉగ్రవాదం, దాని సంబంధిత నేరాలను మోడీ ప్రభుత్వం ఉపేక్షించడం లేదన్నారు. ఉగ్రవాద దర్యాప్తులో మెరుగైన సమన్వయం కోసం విదేశీయులకు చెందిన దర్యాప్తు సంస్థలతో సంబంధాలను ఏర్పరచుకునే దిశగా ఎన్ఐఏ పనిచేస్తోందన్నారు. అనంతరం బీజేపీ ఏర్పాటు చేసిన సెమినార్‌లో షా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో నక్సలిజం అంతమైపోతుందన్నారు. ‘మోదీ @20: డ్రీమ్స్ మీట్ డెలివరీ’ – అనే పుస్తకంపై జరిగిన ఈ సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. బంధుప్రీతితో పోరాడి మోడీ ప్రధాని అయ్యారు. ఆయన పేద కుటుంబం నుంచి వచ్చారు. అణగారిన వర్గాల సంక్షేమంపై దృష్టి పెట్టార‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement