Saturday, April 20, 2024

వికసించిన బ్రహ్మ కమలం

గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో ఏడెల్లి సుమతి రమాదేవి చంద్రారెడ్డి దంపతుల ఇంటి ఆవరణలో బ్రహ్మ కమలం పువ్వు వికసించింది. దీంతో గ్రామంలోని మహిళలు మంగళహారతులు, కొబ్బరికాయ కొడుతూ ఆ పువ్వును చూసి ఆ శివ పరమేశ్వరుని వేడుకుంటూ పూజలు చేశారు. సంవత్సరానికి ఒకసారి ఈ పువ్వు పూస్తుంది. చాలా అరుదుగా ఈ బ్రహ్మ కమలం చెట్లు మన తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే దర్శనమిస్తాయి. ఈ క్రమంలో చంద్రారెడ్డి హైదరాబాదు నుండి మూడు సంవత్సరాల క్రితం ఓ చెట్టును తెచ్చి తన ఇంటి ఆవరణలో పెంచగా శ్రావణమాసం చివరి రోజు అమావాస్య నాడు ఈ పువ్వు పూసింది. పూచిన రెండు మూడు గంటల్లోనే ఈ పువ్వు మళ్లీ నిద్రిస్తుంది. ఎక్కువగా బ్రహ్మకమలం కార్తీకమాసం లో కార్తీక పౌర్ణరోజున పూస్తుంది కానీ ఈసారి అమావాస్య రోజు పూయడంపై గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ పువ్వు ని చూస్తూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement