Saturday, December 2, 2023

Breaking: తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య

పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగం రాలేని మనస్తాపంతో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. రైలు కింద పడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంకి చెందిన నిరుద్యోగి ముత్యాలసాగర్‌.. ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement