Sunday, May 5, 2024

Life: త‌ట్టుకోలేని నెలసరి నొప్పి.. ఈ టాబ్లెట్స్ తో ఎంతో రిలీఫ్

పోస్ట్​ మెనుస్ట్రువల్​ సిండ్రోమ్..​​. పీరియడ్​కి ముందు 5 నుంచి 11 రోజుల మధ్య ఈ సిండ్రోమ్​ ఎక్కువగా కనిపిస్తుంటుంది. పట్టరాని కోపం, విపరీతమైన టెన్షన్​, ఆదుర్దా, మూడ్​ స్వింగ్స్, ఫుడ్​ క్రేవింగ్స్ , నిద్రలేమి ఈ సిండ్రోమ్​ లక్షణాలు అంటున్నారు డాక్ట‌ర్లు. అలాగే కండరాలు, ఒళ్లు, ఛాతి నొప్పులు, తలనొప్పి, బరువు పెరగడం, కడుపు ఉబ్బరం కూడా ఉంటుంద‌ట‌. కొంత‌మంది అయితే పీరియడ్​ కన్నా పోస్ట్ మెనుస్ట్రువల్​ సిండ్రోమ్‌తోనే ఎక్కువ ఇబ్బందికి గుర‌వుతార‌ని చెబుతున్నారు. కానీ, ఈ సిండ్రోమ్​ గురించి ఎవరూ నోరు విప్పి బ‌య‌టికి చెప్పుకోరు. ప్రతినెలా మౌనంగానే ఆ నొప్పిని భరిస్తుంటారు చాలామంది. అయితే ఆడవాళ్లకి ఈ సిండ్రోమ్​ నుంచి రిలీఫ్​ ఇవ్వడానికి వచ్చినవే ‘గమ్మీ టెడ్డీస్’​. ‘పవర్​ గమ్మీస్’​ అనే కంపెనీ ఈ స్పెషల్ గమ్మీలని రీసెంట్​గా మార్కెట్​లోకి తీసుకొచ్చింది.

బెర్రీ గుజ్జు, మిల్క్​ థిస్టిల్ ​(బోడసారం) గింజలతో తయారుచేసిన ఈ గమ్మీలు​ పీఎమ్​ఎస్​ లో కనిపించే ఒళ్లు నొప్పులు, తిమ్మిర్లతో పాటు ఛాతి ఉబ్బు, నొప్పిని తగ్గిస్తాయి. ఈ గమ్మీలలోని విటమిన్​–సి పీరియడ్​ టైంలో బ్లీడింగ్​ సజావుగా అయ్యేలా చూస్తుంది. మెగ్నీషియం, సల్ఫేట్​ నిద్రలేమిని దూరం చేస్తాయి. సిట్రస్​ బయో ఫ్లేవనాయిడ్స్​, విటమిన్–​ బి6 ఆకలిని కంట్రోల్ చేస్తాయి. నెలసరి​ సైకిల్​కి ముందు మూడురోజుల పాటు రోజుకో గమ్మీ, పీరియడ్​లో నాలుగు గమ్మీలు, పీరియడ్​ తర్వాత మూడు రోజుల పాటు ఈ గమ్మీలు తింటే చాలు. వీటిని powergummies.comలో కొనుగోలు చేయొచ్చని చెబుత‌న్నారు వైద్య నిపుణులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement