Thursday, April 25, 2024

Russia – Ukraine war: రష్యా రాకెట్ దాడి.. ఉక్రెయిన్ నటి ఒక్సానా మృతి

రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్ పై రష్యా బాంబులతో విరుచుకుపడుతున్నారు. రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్‌లో ప్రముఖ సినీ నటి ఒక్సానా ష్వెట్స్‌  మరణించారు. కైవ్‌లోని నివాస భవనంపై రష్యా రాకెట్ దాడిలో ఉక్రెయిన్‌ నటి ఒక్సానా ష్వెట్స్ మరణించారు.  దీంతో 67 ఏళ్ల ఒక్సానా మృతిచెందారని ఆమె నేతృత్వంలో పనిచేస్తున్న ‘యంగ్‌ థియేటర్‌’ ప్రకటించింది.  సుదీర్ఘకాలం పాటు థియేటర్‌ ఆర్టిస్టుగా కొనసాగిన ఆమె.. ఉక్రెయిన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మెరిటెడ్ ఆర్టిస్ట్ అవార్డును అందుకున్నారు. అనేక సినిమాల్లో కూడా ఆమె నటించింది. ఆమెకు ఉక్రెయిన్ యొక్క అత్యున్నత కళాత్మక గౌరవాలలో ఒకటి లభించింది. దీని బిరుదును ‘ఉక్రెయిన్ గౌరవనీయ కళాకారిణి’ అని అనువదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement