Monday, April 29, 2024

ఉక్రెయిన్ ప్ర‌జ‌ల‌కి యుద్ధ మెళ‌కువ‌ల పాఠాలు – గ‌న్ను ప‌ట్టిన 79ఏళ్ల బామ్మ‌

ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి చేయ‌నుంద‌ని ప‌లు హెచ్చ‌రిక‌లు ఇప్ప‌టికే వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్ ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేస్తోంది అక్క‌డి ప్ర‌భుత్వం పౌరులకు యుద్ధానికి సంబంధించి అవగాహన పెంచే పని చేపడుతోంది. పౌరులకు యుద్ధ విద్యల్లో తేలికపాటి శిక్షణ ఇస్తుంది. సివిల్ కంబాట్ ట్రైనింగ్, గన్నులను అసెంబుల్ చేయడం, డిససెంబుల్ చేయడం, అమ్యునిషన్ లోడ్ చేయడం, లక్ష్యానికి గురిపెట్టడం వంటి వాటిల్లో శిక్షణ ఇస్తున్నది. ఈ శిక్షణలో యువతనే కాదు.. చిన్న పిల్లలు మొదలు.. పండు ముదుసలి వారి వరకు పాల్గొంటుడం ఆసక్తికరంగా మారింది. ఉక్రెయిన్ స్పెషల్ ఫోర్స్ ఇస్తున్న ఈ శిక్షణలో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని మరియుపోల్‌లో 79 ఏళ్ల బామ్మ వాలెంటినా కాన్‌స్టాంటినోవ్‌స్క్ కూడా పాల్గొన్నారు. 79 ఏళ్ల బామ్మ వాలెంటినా మిలిటరీ డ్రిల్‌లో పాల్గొనడం ఆసక్తిదాయకంగా మారింది.

ఆమె ఫొటోనూ ఓ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ విషయాన్ని ఆమెతో ప్రస్తావిస్తే.. అంతే ఆశ్చర్యకరంగా మాట్లాడారు. తాను తన నగరం, తన కుటుంబం, తన దేశం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. తాను అందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అంతేకానీ, నా నగరాన్ని, నా దేశాన్ని కోల్పోవాలని అనుకోవడం లేదని అన్నారు. అదే సమయంలో తాను దృఢమైన సైనికురాలినేమీ కాకపోవచ్చని చెప్పారు. తాను ఈ శిక్షణ తీసుకున్నప్పటికీ తన దేహం సైనిక చర్యలకు సహకరించకపోవచ్చని తెలిపారు. ఒక వేళ రష్యా దురాక్రమణకు పాల్పడితే ఆ యుద్ధంలో పాల్గొనడానికి తన బాడీ సహకరించకపోవచ్చని పేర్కొన్నారు. ఆయుధాలు తాను మోయలేకుండా ఉన్నానని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement