Monday, April 29, 2024

చీర‌కోసం జుట్టుప‌ట్టుకుని కొట్టుకున్న.. ఇద్ద‌రు మ‌హిళ‌లు

డిస్కౌంట్ లో వచ్చే ఓ చీర‌కోసం ఇద్ద‌రు మ‌హిళ‌లు జుట్టు ప‌ట్టుకుని మ‌రీ కొట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు లోని మల్లేశ్వరం ప్రాంతంలో ఉండే మైసూరు సిల్క్‌ శారీ సెంటర్ ఇటీవల డిస్కౌంట్‌ ధరలతో ఇయర్లీ శారీ సేల్ నిర్వహించింది. బయట మార్కెట్‌ కంటే తక్కువ ధర ఉండటం, చీరలు కూడా బాగుండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు మహిళలు ఆ దుకాణానికి క్యూ కట్టారు. తమకు నచ్చిన చీరలను బుట్టలో వేసుకోవడం మొదలు పెట్టారు. అందులో ఇద్దరు మహిళలకు ఒకే చీర నచ్చింది. అంతే, ఇంకేముంది.. ఆ చీర నాకు కావాలని ఒకరంటే.. కాదు నాకు కావాలి అని మరో మహిళ గొడవకు దిగారు. అది కాస్తా ముదిరి ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకునేవరకు వెళ్లారు. వారిని అదుపు చేసేందుకు అక్కడున్న సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement