Friday, April 26, 2024

TSRTC: టికెట్ ధరపై 20 శాతం తగ్గింపు

తెలంగాణ ఆర్టీసీని ప్రయాణికులకు చేరువ చేసేందుకు సంస్థ ఎండీ సజ్జనార్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. తాజాగా ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పారు. ట్రావెల్ యూస్ యు లైక్ టిక్కెట్ల ధరలపై 20% డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించారు. ఈనెల 18 నుంచి 27 వరకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ గార్డెన్స్ లో బుక్ ఫేర్ జరుగుతోంది.

34వ బుక్ ఫెయిర్ సందర్భంగా డిసెంబర్ 18 నుంచి 27 వరకు ఈ బుక్ ఫెయిర్ ను సందర్శించే వారి T24 టికెట్లపై 20 శాతాన్ని తగ్గిస్తున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ అవకాశాన్ని పుస్తకప్రియులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కాగా, వంద రూపాయలు ఉన్న T24 టికెట్ల ధర.. ఇప్పుడు 80 రూపాయలకు తగ్గనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement