Monday, April 29, 2024

TSPSC కీలక సమావేశం.. గ్రూప్‌-1 పోస్టుల భర్తీపై ప్రకటన!

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ తొలి గ్రూప్‌-1 ప్రకటన జారీకి వీలుగా ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన సవరణ ప్రతిపాదనల్ని పరిశీలిస్తుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ప్రభుత్వ ఉత్తర్వులను సరిచూసి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో అధికారులు గుర్తిస్తారు. అన్నీ అనుకూలంగా ఉంటే గ్రూప్‌-1 ప్రకటన జారీపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశముంది. ఒకవేళ ఏమైనా లోటుపాట్లు ఉంటే రెండుమూడు రోజుల సమయమిచ్చి, సమగ్రమైన ప్రతిపాదనలు తీసుకుంటారు. కాగా, గ్రూప్‌-1లో 19 విభాగాలకు చెందిన 503 పోస్టులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement