Wednesday, April 24, 2024

Covid-19: మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 2527 కేసులు

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. మొన్నటి వరకు వెయ్యి లోపే కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య మూడు వేలకు చేరువ అవుతోంది.  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా  2527 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,54,952కు చేరాయి. ఇందులో 4,25,17,124 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 15,079 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

గత 24 గంటల్లో 1656 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 33 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,22,149కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో పాటివిటీ రేటు 0.56 శాతంగా ఉండగా.. రికవరీరేటు 98.75 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,87,46,72,536 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement