Friday, May 3, 2024

TS POLYCET : పాలిసెట్ ఫ‌లితాలు విడుదల‌.. 82.7 శాతం ఉత్తీర్ణత

టీఎస్‌ పాలిసెట్‌ ఫలితాలు కాసేప‌టి క్రిత‌మే విడుదలయ్యాయి. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక భవన్‌లోని తన కార్యాలయంలో నవీన్‌ మిట్టల్ ఫలితాలను ప్రకటించారు. పరీక్షల్లో 82.7 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. 86.63 శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు సత్తా చాటారు. ఈనెల 17న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 98,274 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 1,05,656 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 58,468 మంది అబ్బాయిలు, 47,188 మంది అమ్మాయిలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement