Monday, December 9, 2024

15న టీఆర్‌ఎస్ లెజిస్లేచర్​ పార్టీ భేటీ.. తెలంగాణ భవన్​లో ప్రత్యేక సమావేశం

ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనున్నది. అట్లనే టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం ఉండబోతోంది. ఈమేరకు పార్టీ వర్గాలు ఇవ్వాల (ఆదివారం) ఈ విషయాన్ని వెల్లడించాయి. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ఉంటుందని, సమావేశంలో శాసనసభ సభ్యులు, మండలి సభ్యులు, పార్లమెంట్‌ సభ్యులతో పాటు టీఆర్‌ఎస్‌ రాష్ట్రస్థాయి నేతలు పాల్గొంటారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement