Saturday, April 1, 2023

అయ్యప్ప దీక్షాపరుల సౌకర్యార్థం.. కేరళకు ప్రత్యేక రైళ్లు నడపుతున్న రైల్వే

కార్తీకమాసం వచ్చేసింది.. ఇక అయ్యప్ప స్వాములు శబరిమలై వెళ్లనున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు కేరళ వెళ్లేందుకు సన్నద్ధమవుతుంటారు. అయితే అయ్యప్ప స్వాముల సందర్శనార్థం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా శబరిమలకు వెళ్లి వచ్చే యాత్రికుల కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

నవంబర్‌ 17, 24 తేదీల్లో నాందేడ్‌- కొల్లం ప్రత్యేక రైలు (07129), నవంబర్‌19, 26 తేదీల్లో కొల్లం-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (Kollam-Secunderabad special train) (07130), నవంబర్‌21, 28 తేదీల్లో నర్సాపూర్‌-కొల్లం ప్రత్యేక రైలు (Narsapur-Kollam Special Train) (07131) నవంబర్‌ 22, 29 తేదీల్లో కొల్లం-నర్సాపూర్‌ ప్రత్యేక రైలు (07132) నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement