Sunday, April 28, 2024

కేజీఎఫ్2 నుంచి ‘తుఫాన్’ లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ – య‌శ్ లుక్ అదుర్స్

కేజీఎఫ్ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. ఈ చిత్రంతో హీరో య‌శ్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. కాగా కేజీఎఫ్ కి సీక్వెల్ గా కేజీఎఫ్2 ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాను ఏప్రిల్‌ 14న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కేజీఎఫ్‌ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టారు. కేజీఎఫ్‌ ఫస్ట్ పార్ట్‌ భారీగా విజయాన్ని దక్కించుకోవడంతో.. కేజీఎఫ్‌ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగానే ద‌ర్శ‌కుడు ప్రశాంత్‌ నీల్‌ సీక్వెల్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ‘తుఫాన్‌’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్ గూస్ బంబ్ ని తెప్పిస్తోంది. అదే స్టైల్ , అదే ఉగ్ర‌రూపంతో క‌నిపించాడు య‌శ్.. ఈ చిత్రం ప‌క్కా హిట్ అనిపించేలా అంచ‌నాలు పెంచుతోందీ సాంగ్. ఈ సాంగ్ ని శ్రీకృష్ణ‌, పృథ్వీచంద్ర‌తో పాటు ప‌లువురు ఆల‌పించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement