Friday, May 17, 2024

తెలుగు చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో : సైనికులకు ఘన నివాళులు

తమిళనాడు లో జరిగిన సైనిక హెలికాప్టర్ దుర్ఘటనలోత్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అతని భార్యతో పాటు, 13 మంది సైనిక అధికారులకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో ఘనంగా నివాళులు అర్పించింది బాంబే రవి సంగీత స్వ‌రాలతో వెలువడిన జయహో భారత్ అనే దేశభక్తి గీతాన్ని సైనిక అమర వీరులకు అంకితం చేశారు. ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమారులు మాట్లాడుతూ…దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం మనలను కవిస్తుంటే , మన సైన్యం యాక్షన్ తీసుకోవాలో వద్దో అని సందిగ్ధంలో వుండి అనుమతి కోసం ఎదురుచూసే వారు.

ప్రసుతం కేంద్ర ప్రభుత్వం ఎవరి అనుమతి అవసరం లేకుండా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని మీరు ముందుకు వెళ్ళండి అని బిపిన్ రావత్ సైన్యానికి మనో దైర్యాన్ని ఇచ్చి సర్జికల్ స్ట్రైక్ చేశారు.మన సైన్యం పాకిస్థాన్ లోపలికి వెళ్లి వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేసి మళ్ళీ మన దేశానికి రావడం పట్ల బిపీన్ రావత్ సహకారం ఎంతో అందించారు.హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ అతని భార్య తో పాటు 13మంది సైనికులు మృతి చెందటం బాధాక‌ర‌మ‌న్నారు.ఈ కార్యక్రమంలో దర్శకులు అజయ్ కుమార్,తెలుగు ఫిల్మ్ పెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, సీనియర్ జర్నలిస్ట్ భగీరథ, ఈవిఎన్ చారి,కాట్రగడ్డ సుధాకర్,శివరామ్ రెడ్డి ,బాంబే రవి,ఇంద్ర మోహన్,తోట కృష్ణ, మందిని తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement