Thursday, May 2, 2024

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. జూలై 7న బంగారం ధర ఏకంగా రూ. 540 పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,930కు దిగివచ్చింది. అలాగే ఆర్నమెంటల్ గోల్డ్ రేటు (22 క్యారెట్లు) కూడా ఇదే దారిలో పయనించింది. ఈ పసిడి రేటు రూ. 500 తగ్గింది. దీంతో బంగారం ధర రూ. 47,600కు క్షీణించింది. బంగారం, వెండి రెండూ విలువైన లోహాలు. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. సిల్వర్ రేటు ఇంకా ఎక్కువగానే దిగివచ్చింది. వెండి ధర ఏకంగా ఒకేసారి రూ. 2,200 కుప్పకూలింది. దీంతో వెండి రేటు కేజీకి రూ. 62,500కు తగ్గింది.

కాగా వెండి ధర గత రెండు రోజులు పెరుగుతూ వచ్చింది. ఈ కాలంలో ఏకంగా రూ. 1200 పైకి చేరింది. అయితే ఈరోజు మాత్రం సిల్వర్ రేటు భారీగా పతనమైంది. వెండి కొనాలనుకునే వారికి ఇది ఊటర కలిగించే అంశం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో చూస్తే.. బంగారం ధరలు పెరిగాయి. వెండి రేటు కూడా పైకి చేరింది. అయినా కూడా ఇంకా దిగువ స్థాయిల్లోనే పసిడి, వెండి రేట్లు కొనసాగుతున్నాయి. గోల్డ్ రేటు ఔన్స్‌కు 0.2 శాతం పెరిగింది. 1740 డాలర్ల వద్ద కదలాడుతోంది. అలాగే సిల్వర్ రేటు అయితే ఔన్స్‌కు 0.03 శాతం పెరిగింది. 19.16 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement