Friday, September 22, 2023

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.. అమెరికాలో ద్రవ్యోల్బణం గరిష్ఠంగా ఉన్న నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌లో గోల్డ్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అంతర్జాతీయంగానూ ఇటీవల ధరలు పెరుగుతున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినప్పటికీ ద్రవ్యోల్బణం దిగిరావడం లేదు. దీంతో బంగారంపై పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ కారణంగా స్పాట్ గోల్డ్ రేటు పెరుగుతోంది. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2032.45 డాలర్లు పలుకుతోంది. కొద్ది రోజుల క్రితం ఇది 1800 డాలర్ల స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం సిల్వర్ ఔన్సుకు 25.45 డాలర్ల వద్ద కొనసాగుతుంది. రూపాయి మారక విలువ గ్లోబల్ మార్కెట్లో డాలర్‍‌తో పోలిస్తే ప్రస్తుతం రూ.81.978 వద్ద ట్రేడవుతుంది.

- Advertisement -
   

హైదరాబాద్‌‌లో బంగారం ధర ఇవాళ 22 గ్రాముల తులానికి క్రితం రోజుతో పోలిస్తే స్థిరంగా ఉంది. ప్రస్తుతం 10 గ్రాముల రేటు రూ.56 వేల 950 మార్క్ వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములకు రూ.62 వేల 130 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే 22 క్యారెట్ల బగారం ధర ఇవాళ ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం రూ.57 వేల 100 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు ఢిల్లీలో రూ.62 వేల 280 వద్ద ఉంది.వెండి విషయానికి వస్తే ఇవాళ రూ.400 పడిపోయింది. ప్రస్తుతం కిలో వెండి రేటు ఢిల్లీలో రూ.77 వేల 600 మార్క్ వద్ద ట్రేడవుతోంది. మరోవైపు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.700 తగ్గింది. ప్రస్తుతం రూ.82 వేల మార్క్ వద్ద కొనసాగుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి రేటు కాస్త ఎక్కువ, బంగారం ధర కాస్త తక్కువ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement