Saturday, May 18, 2024

నేటి బంగారం ధ‌ర‌లు – త‌గ్గిన వెండి రేటు

నేడు బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి..బంగారం ధ‌ర వరుసగా రెండో రోజు కూడా దిగివచ్చింది. జూన్ 2న హైదరాబాద్‌లో 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర రూ. 250 తగ్గింది. దీంతో ఈ బంగారం ధర 10 గ్రాములకు రూ. 47,500కు క్షీణించింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 280 పడిపోయింది. రూ. 51,820కు తగ్గింది. బంగారం ధర రెండు రోజుల్లోనే రూ. 380 మేర దిగి వచ్చింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా దాదాపు ఇదే రేట్లు కొసాగుతున్నాయి. బంగారం ధర తగ్గితే వెండి కూడా ఇదే దారిలో నడిచింది. సిల్వర్ రేటు కేజీకి రూ. 500 తగ్గింది. దీంతో వెండి ధర రూ. 67 వేలకు పడిపోయింది. వెండి ఆభరణాలు, కడియాలు, గజ్జలు వంటివి కొనాలని చూస్తే వారికి ఇది కాస్త ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. కాగా సిల్వర్ రేటు నిన్న పెరిగిన విషయం తెలిసిందే. దీని కన్నా ముందు రెండు రోజులుగా సిల్వర్ రేటులో ఎలాంటి మార్పు లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement