Sunday, April 28, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-త‌గ్గిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు కాస్త ఊర‌టనిచ్చాయి. ఆదివారం మార్కెట్లలో ఈ రేట్లు పడిపోయాయి. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన ఈ ధరలకు బ్రేక్ పడింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.47,300గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గడంతో.. ఈ రేటు రూ.51,600గా ఉంది. బంగారంతో పాటు వెండి రేటు కూడా పతనమైంది. కేజీ వెండిపై రూ.600 మేర ధర తగ్గడంతో.. ఈ రేటు రూ.60,700కు దిగొచ్చింది.గత వారం రోజులుగా చూసుకుంటే మాత్రం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన బంగారం రేట్లు రూ.47,600 నుంచి రూ.47,300కు పడిపోయాయి. అంటే రూ.300 మేర ధరలు తగ్గాయి. ఈ మధ్యలో మూడుసార్లు ధరలు పెరగగా.. మూడుసార్లు ధరలు తగ్గాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement