Saturday, May 4, 2024

Today : బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగింది. దీంతో ఇప్పుడు రూ.55,100 మార్కు వద్ద ట్రేడవుతోంది. మరోవైపు 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు కూడా రూ.440 పుంజుకోగా.. ప్రస్తుతం రూ.60,110 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటుగానే దిల్లీలో కూడా బంగారం ధర ఎగబాకింది. ఇక్కడ 10 గ్రామలు బంగారం రేటు 22 క్యారెట్లకు ఒక్కరోజే రూ.400 పెరిగి రూ.55,250 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.440 పెరగ్గా.. రూ.60,260 మార్కు వద్ద ఉంది.

సిల్వర్ రేట్ల విషయానికి వస్తే దిల్లీలో స్థిరంగా కిలోకు రూ.73,100 మార్కు వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో మాత్రం పెరిగింది. ఇక్కడ మళ్లీ రూ.1000 పెరగ్గా కేజీ సిల్వర్ రేటు రూ.78,500 వద్ద ఉంది. అంతకుముందు 4 రోజుల్లో సిల్వర్ ధర రూ.2300 మేర పడిపోయిన సంగతి తెలిసిందే.దేశ రాజధాని దిల్లీలో గోల్డ్ రేటు 24 క్యారెట్లకు 10 గ్రాములకు రూ. 550 పతనం కాగా.. ప్రస్తుతం రూ. 59,700 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా ఒక కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిపోర్ట్ చెప్పింది. కిందటి సెషన్‍‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 60,250 వద్ద ముగిసింది. బంగారం ధరతో పాటే.. వెండి రేటు కూడా భారీగా దిగొచ్చింది. దిల్లీలో ఒక్కరోజే సిల్వర్ రేటు రూ.900 పడిపోగా.. కేజీకి రూ.72,600కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement