Monday, April 29, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. అంతర్జాతీయ మార్కెట్లో చూసుకుంటే గోల్డ్, సిల్వర్ రేట్లు (Silver Prices) భారీగా పడిపోతున్నాయి. వరుసగా దిగివస్తూ ఊరట కలిగిస్తున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుతో డాలర్ పుంజుకోవడం బంగారం ధరల పతనానికి కారణమవుతోంది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1975 డాలర్లు పలుకుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.51 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు.. భారత కరెన్సీ రూపాయి మారకం విలువ కాస్త పడిపోయింది. ఇవాళ డాలర్‌తో పోలిస్తే రూ.82.903 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు మే 24న రూ.290 తగ్గింది. ప్రస్తుతం రూ. 56 వేలు పలుకుతోంది.

ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములకు రూ.310 పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం రేటు రూ.61 వేల 100 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి రూ.290 తగ్గి రూ.56 వేల 150 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమై బంగారం ఢిల్లీలో 10 గ్రాములకు రూ.310 తగ్గి రూ. 61 వేల 250 పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే బంగారం దారిలోనే వరుసగా దిగివస్తోంది. వరుసగా రెండో రోజు వెండి ధర పతనమైంది. ఏకంగా రూ.1000 మేర దిగివచ్చింది. ఇవాళ కిలో వెండి రేటు ఢిల్లీ మార్కెట్లో రూ.500 తగ్గి రూ.74 వేల 500 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.600 తగ్గింది . ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు రూ.78 వేలు పలుకుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement