Friday, May 17, 2024

షాక్ ఇచ్చిన బంగారం..పెరిగిన వెండి

నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా పసిడి తన ప్రియులకు షాకిచ్చింది. అక్కడ కూడా ఈ ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో రూ.800 పెరిగి రూ.47,150కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.840 పెరిగి రూ.51,440కు ఎగిసింది. బంగారం ధరలు(Gold Rates) భారీగా పెరిగిన సమయంలో వెండి రేట్లు కూడా వెలిగిపోతున్నాయి. వెండి రేటు కూడా ఏకంగా రూ.1,550 పెరిగింది. దీంతో ఈ ధర కేజీ రూ.57,700కి ఎగిసింది. విజయవాడ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరల(Gold Silver Prices) పెరుగుదల ఈ విధంగానే ఉంది. విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరిగి రూ.47 వేలకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.830 పెరిగి రూ.51,280కి ఎగిసింది. బంగారం ధరలు పెరిగిన ఈ సమయంలో వెండి రేట్లు కూడా కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వెండి రేటు కూడా ఏకంగా రూ.1,700 పెరగడంతో.. కేజీ రూ.63,200కి ఎగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement