Friday, May 3, 2024

నేటి బంగారం ధ‌ర‌లు – నిల‌క‌డ‌గా వెండి

నేటి బంగారం ధ‌ర‌లు కాస్త పెరిగాయి..గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధర నేడు పైపైకి కదిలింది. హైదరాబాద్‌లో మే 31న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పైకి చేరింది. రూ. 52,200కు ఎగసింది. అలాగే ఆర్నమెంట్ బంగారం ధర (22 క్యారెట్ల) రూ. 100 పెరుగుదలతో రూ. 47,850కు ఎగసింది. వెండి రేటు కేజీకి రూ. 67 వేల వద్దనే ఉంది. సిల్వర్ రేటులో మార్పు లేదని చెప్పుకోవచ్చు. వెండి ధర కూడా రెండు రోజులుగా నిలకడగానే కొనసాగుతూ వస్తోంది.

ప్లాటినం ధర విషయానికి వస్తే 10 గ్రాములకు రూ. 80 పెరుగుదలతో రూ. 23,880కు చేరింది. దేశీ మార్కెట్‌లో బంగారం ధర జిగేల్ మంటే.. గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం ట్రెండ్ రివర్స్‌లో ఉంది. బంగారం ధర ఔన్స్‌కు 0.35 శాతం దిగొచ్చింది. 1850 డాలర్ల వద్ద కదలాడుతోంది. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. 0.84 శాతం పడిపోయింది. సిల్వర్ రేటు ఔన్స్‌కు 21.76 డాలర్ల వద్ద కదలాడుతోంది. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దేశీ మార్కెట్‌లో గోల్డ్ రేట్లను ప్రభావితం చేస్తుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement