Monday, May 6, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, దిల్లీల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2020 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 25.58 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.82 వద్ద కొనసాగుతోంది. దేశీయంగా చూస్తే హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల గోల్డ్ రేటు 22 క్యారెట్లకు ప్రస్తుతం రూ.110 మేర పెరిగి రూ.56,600కు చేరింది.

ఇదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.120 ఎగబాకి రూ.61,750 వద్ద ఉంది. అంతకుముందు రెండు రోజుల్లో రేటు రూ.710 మేర తగ్గింది. దిల్లీ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. ఇక్కడ ఒక్కరోజే 10 గ్రాముల బంగరం ధర రూ.110 పెరగ్గా.. ప్రస్తుతం 22 క్యారెట్లకు రూ.56750 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే దిల్లీలో 10 గ్రాములకు రూ.120 పెరిగి రూ.61,900 మార్కు వద్ద ట్రేడవుతోంది. బంగారం ధరతో పాటే వెండి రేట్లు కూడా ఎగబాకాయి. ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు దిల్లీ మార్కెట్‌లో రూ.400 పెరిగి రూ.78,100 వద్ద ట్రేడవుతోంది. ఇక హైదరాబాద్‌లో చూస్తే వెండి రేట్లు రికార్డు గరిష్టాల వద్ద కొనసాగుతున్నాయి. కిలో సిల్వర్ రేటు ఇక్కడ ఒక్కరోజే రూ.300 పెరిగి రూ.82,700 మార్కు వద్ద కదలాడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement