Sunday, May 19, 2024

స్వ‌ల్పంగా పెరిగిన గోల్డ్-త‌గ్గిన వెండి ధ‌ర‌

నేడు బంగారం ధ‌ర స్వ‌ల్పంగా పెరిగింది..కాగా వెండి ధ‌ర త‌గ్గింది.హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా రూ.50 పెరగడంతో… ఈ రేటు రూ.47,550కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం కూడా కేవలం రూ.50 మాత్రమే పెరిగి రూ.51,870గా నమోదైంది. ఢిల్లీ మార్కెట్లో కూడా వెండి ధర పడిపోయింది. కేజీ వెండి ధర రూ.200 తగ్గి రూ.59,800కు దిగొచ్చింది. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, విజయవాడ బులియన్ మార్కెట్లలో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరగగా.. వెండి ధరలు తగ్గాయి.అయితే ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకే తాము కట్టుబడి ఉన్నామని ఫెడ్ ఛైర్ పావెల్ కాంగ్రెస్ ఎదుట టెస్టిమొని ఇచ్చిన తర్వాత.. బంగారం ధరలు పడిపోయాయి.

దీంతో వడ్డీ రేట్ల పెంపు ఇంకా ఉంటుందని అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. బంగారం ధరలు దిగొచ్చాయి. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అటు గ్లోబల్ మార్కెట్లలో కూడా బంగారం ధరలు ఔన్స్ 1,824 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను భారీగా పెంచుతుండటంతో.. బంగారం ధరలు దిగొచ్చాయి. కానీ నేడు ట్రెండ్ రివర్స్ అయింది. బంగారం ధరలు బులియన్ మార్కెట్లలో స్వల్పంగా పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement