Friday, May 3, 2024

Smart Tech: ఫోన్ లో మైబైల్ డేటా సేవ్ చేసుకోవడానికి.. ఈ ఆప్షన్స్ ఉపయోగించండి..

ఊరికూరికే మీ మొబైల్ డేటా ఖాళీ అయిపోతోందా? వాస్తవానికి మన ఫోన్లో ఇన్స్ స్టాల్ చేసిన కొన్ని అప్లికేషన్స్ మాత్రమే భారీ మొత్తంలో మొబైల్ డేటా వినియోగించుకుంటాయి. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్ లలో కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా మొబైల్ డేటా వినియోగం తగ్గించుకునే అవకాశం ఉంది. దీనికోసం యూజర్లు చేయాల్సిందల్లా ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ లోకి వెళ్లి.. నెట్ వర్క్ అండ్ ఇంటర్ నెట్ అనే విభాగంలోకి వెళ్లండి.

ఒక్కో ఫోన్ లో ఈ పేరు ఒక్కోలా ఉంటుంది. సరైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత.. అక్కడ కనిపించే డేటా సేవర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా కొన్ని అప్లికేషన్స్ సర్వర్ నుండి మీ ఫోన్లోకి డేటా వచ్చే దశలోనే డేటా కంప్రెస్ చేసేలా చూస్తూ.. తక్కువ డేటా వినియోగించుకునే విధంగా జాగ్రత్త పడతాయి.

అలాగే, App data usage అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే.. వెంటనే స్క్రీన్ మీద మీ ఫోన్లో ఇన్ స్టాల్ చేసిన వివిధ రకాల అప్లికేషన్స్ ఎంత మొత్తంలో డేటా వినియోగించుకుంటున్నాయి అన్నది కూడా చూడొచ్చు. దాంట్లో బ్యాక్ గ్రౌండ్, ఫోర్ గ్రౌండ్ అనే రెండు విభాగాలుంటాయి. Background Data అనే దాన్ని డిజేబుల్ చేయటం ద్వారా అనవసరమైనప్పుడు సంబంధిత అప్లికేషన్స్ మొబైల్ డేటా వినియోగించుకోకుండా పరిమితి విధించవచ్చు.

ఒకవేళ మీ ఫోన్లో Unrestricted Data అనే ఆప్షన్ లభిస్తున్నట్లు అయితే దాన్ని కూడా డిజేబుల్ చేస్తే మరింత డేటా ఆదా అవుతుంది. దీంతోపాటు Google Play Storeలో లభించే No root firewall అనే అప్లికేషన్ ఉపయోగించడం ద్వారా, మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన కొన్ని అప్లికేషన్లకు పూర్తిస్థాయిలో మొబైల్ డేటా డిజేబుల్ చేసే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా పలు పద్ధతులను అనుసరించడం ద్వారా భారీ మొత్తంలో మొబైల్ డేటా ఆదా చేసుకోవడానికి సాధ్యపడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement