Wednesday, May 1, 2024

Breaking | ఆ వెపన్స్​ వెనక్కి ఇవ్వాలి.. ఆర్డర్స్​ జారీ చేసిన సీపీ ఆనంద్​

హైదరాబాద్ సిటీ పోలీస్​ కమిషనర్ ఇవ్వాల (మంగళవారం)​​ కీలక ఉత్తర్వులిచ్చారు. పొలిటికల్​ లీడర్స్​ తమ ప్రొటెక్షన్​ కోసం తీసుకున్న  వెపన్స్​ని ఆయా స్టేషన్లలో డిపాజిట్​ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 16లోపు పీఎస్​లలో వెపన్స్​ డిపాజిట్​ చేయాలని ఆదేశించారు. లేకపోతే చర్యలుంటాయని తెలిపారు. ఇక.. డిసెంబర్​ 10 తర్వాత డిపాజిట్​ చేసిన వెపన్స్​ని తిరిగి తీసుకోవచ్చని సూచించారు.

కాగా, ఎన్నికల కోడ్​ నేపథ్యంలో హైదరాబాద్​లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నిన్న ఒక్కరోజే భారీగా బంగారం, నగదు పట్టుబడింది. 15 కిలోల బంగారం, 400 కిలోల వెండి సీజ్​ చేశారు. ఇక.. 50 వేల కంటే ఎక్కువగా నగదు తీసుకెళ్లే వారు తప్పకుండా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్​ని సమర్పించాలని సూచించారు. మద్యం పంపిణీ, ఎన్నికల గిఫ్ట్స్​పై పోలీసులు ఫోకస్​ పెట్టారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement