Monday, April 15, 2024

ఈసారైనా స‌న్ రైజ‌ర్స్ ద‌శ మారేనా…

హైదరాబాద్‌: ఐపీఎల్‌ హాట్‌ ఫేవరెట్లలో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ ఒకటి.. ఇది ఒకప్పటి మాట. 2016లో చివరిసారి టైటిల్‌ సొంతం చేసుకున్న సన్‌రైజర్స్‌ ఆ తర్వాత అంతగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేక పోయింది. హేమాహేమీలు జట్టులో ఉన్నప్పటికీ, బలమైన జట్లతో పోటీలో చతికిల పడుతూ వస్తోంది. బ్యాటింగ్‌ కంటే బౌలింగే ప్రధాన అస్త్రంగా కొద్దోగొప్ప విజయాలు సాధించింది. 2021 సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడు గున నిలిచింది. గతేడాది ఎనిమిదో స్థానంతో కాస్తంత పరువు దక్కించింది. అయితే, ఈసీజన్‌ హైదరా బాద్‌ జట్టు కొత్తగా ఆరంభిస్తోంది. కొత్త కెప్టెన్‌.. కొత్త కోచ్‌తో టైటిల్‌ వేట ప్రారంభిస్తోంది. బ్రియాన్‌ లారా కోచింగ్‌ మెళకువలు, కెప్టెన్‌ మార్‌క్రమ్‌ వ్యూహచతురత జట్టు దశను మార్చు తుందనే ఆశవుంది. గత రెండు సీజన్‌లలో తక్కువ స్థాయి ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్‌రైజన్స్‌, ఈసారి గట్టిపోటీ ఇస్తుందనే భరోసా కనిపిస్తోంది.


బలమైన ఫేస్ దళం..
అనుభవజ్ఞుడైన భువనేశ్వర్‌ కుమార్‌తోపాటు జట్టులో ఉమ్రాన్‌ మాలిక్‌, జాన్సెన్‌ , నటరా జన్‌, కార్తీక్‌ త్యాగితో రైజర్స్‌ బౌలింగ్‌ దళం పటిష్టంగా ఉంది. రిజర్వులో ఉన్న అఎn్గా న్‌ లెఎn్టార్మ్‌ పేసర్‌ ఫజల్‌ హక్‌ ఫరూఖీ కూ డా ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను హడలెత్తిం చగల పేస్‌ బౌలరే.


బలహీనత
నాణ్యమైన స్పిన్‌ బౌలర్లు లేకపోవడం ప్రధాన బలహీనత. ఆదిల్‌ రషీద్‌ ఒక్కడే స్పిన్‌ భారాన్ని మోయాల్సి ఉంటుంది. అతడికి సుందర్‌, మార్‌క్రమ్‌, అభిషేక్‌, మయాంక్‌ మార్కండే నుంచి సహాయం లభిస్తుంది. అభిషేక్‌ వర్మ గత సీజన్‌లో బాగానే ఆడినప్పటికీ, ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తాడా? లేదా? అన్నదే సందేహం. 34 ఐపీఎల్‌ మ్యాచ్‌లలో 23.8 సగటును కలిగివున్నాడు. అబ్దుల్‌ సమద్‌ సగటు 14.2గా ఉంది.

ఆందోళనలు.
సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ బలం గురించి గొప్పగా చెప్పడానికి వీల్లేదు. మయాంక్‌ అగర్వాల్‌, రాహుల్‌ త్రిపాఠి గాయ పడితే, వారి స్థానంలో అనుభవజ్ఞు లెన బ్యాటర్లు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. అన్మోల్‌ ప్రీత్‌, నితీష్‌రెడ్డి, ఉపేంద్ర యాదవ్‌, అబ్దుల్‌ సమద్‌, మయాంక్‌ దాగర్‌, వివ్రాంత్‌ శర్మ, సన్వీర్‌ సింగ్‌, సామ్రాట్‌ వ్యాస్‌ వంటి వారికి ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభ వnం లేదు. స్కోరిం గ్‌ కోసం ఫిలిప్స్‌, క్లాసెస్‌, బ్రూక్‌, మార్‌ క్రమ్‌ వంటి విదేశీయులపై నేఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది.

జట్టు..
అబ్దుల్‌ సమద్‌, ఐడెన్‌ మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), రాహు ల్‌ త్రిపాఠి, గ్లెన్‌ ఫిలిప్‌, అభిషేక్‌వర్మ, మార్కో, జాన్సె న్‌, వాషింగ్టన్‌ సుందర్‌, భువనే శ్వర్‌, ఫజల్లా ఫరూఖీ, కార్తీక్‌ త్యాగి, నటరాజన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, హ్యారీ బ్రూక్‌, మయాంక్‌ అగర్వాల్‌, ఎకెయల్‌ అగర్వాల్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, అన్మోల్‌ ప్రీత్‌సింగ్‌, ఆదిల్‌ రషీద్‌, మయాంక్‌ మార్కండే, వివ్రాంత్‌ శర్మ, మయాంక్‌ దాగర్‌, సామ్రాట్‌ వ్యాస్‌, సంవీర్‌ సింగ్‌, ఉపేంద్ర సింగ్‌ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement