Wednesday, April 24, 2024

వ‌ర‌ల్డ్ ఇడ్లీ డే.. ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఇవే

ప్ర‌తిరోజుకి ఓ లెక్క ఉంది..ఫాద‌ర్స్ డే..మ‌ద‌ర్స్ డే..వుమెన్స్ డేలాగే మార్చి 30న వ‌ర‌ల్డ్ ఇడ్లీ డే అని మీకు తెలుసా. ఇడ్లీ ప్ర‌తి ఒక్కరికి తెలిసిన అల్పాహారం.. సాధారణ ఇడ్లీ కంటే, ఇడ్లీ వడ, ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ తో తినేందుకు ఎక్కువ మంది ఇష్టం చూపిస్తారు. నేడు ప్రపంచ ఇడ్లీ దినం. మ‌రి ఇడ్లీ తిన‌డం వ‌ల్ల ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు ఏంటో తెలుసుకుందాం..ఇడ్లీలో కేలరీలు తక్కువే. ప్రొటీన్, ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గేందుకు సాయపడుతుంది. ఫైబర్ ఉండడంతో జీర్ణం సులభంగా అవుతుంది. మినపపప్పుతో చేయడం వల్ల ఐరన్ కూడా దండిగా లభిస్తుంది. మొదటి రకం ప్రొటీన్ జంతువుల నుంచి లభిస్తుంది. కావాల్సిన అమైనో యాసిడ్స్ సులభంగా అందుతాయి.

మొక్కల ఆధారిత ప్రొటీన్ రెండో రకం అవుతుంది. ఇందులో అమైనో యాసిడ్స్ తక్కువ. ధాన్యాలు, పప్పుల్లో విడిగా అమైనో యాసిడ్స్ ఉండవు. అలా కాకుండా బియ్యం, మినప్పప్పుని ఇడ్లీగా చేసుకోవడం వల్ల అన్ని అమైనో యాసిడ్స్ అందుతాయి. అప్పుడు మొదటి రకం ప్రొటీన్ మాదిరే పనితీరు ఉంటుంది.ఇడ్లీ పిండిని రుబ్బిన వెంటనే ఇడ్లీగా వేసుకోరు. అలా వేసుకున్నా రాదు. కొన్ని గంటల పాటు రుబ్బిన ఇడ్లీ పిండిని అలా ఉంచేయాలి. అప్పుడు ఫెర్మెంటేషన్ జరుగుతుంది. ఇడ్లీ మంచిగా రావడానికి, రుచిగా ఉండడానికి ఈ ప్రక్రియ సాయపడుతుంది. జీర్ణ వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. కాకపోతే పాలిష్ పట్టని బియ్యం. పొట్టుతీయని మినపపప్పును వాడుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇక ఇడ్లీ తయారీకి నూనె అవసరం లేదు. ఈ రకంగానూ ప్రయోజనమే. చూశారా ఇడ్లీతో ఎన్ని ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో.

Advertisement

తాజా వార్తలు

Advertisement